విశాఖ వేదికగా 'నేవీ మిలన్-2024'- నౌకాదళ ఉత్సవాల్లో పాల్గొనున్న 50 దేశాలు
🎬 Watch Now: Feature Video
Navi Milan-2024 International Festival Will held in Visakha: విశాఖలో నేవి మిలన్-2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరుకానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2022 తర్వాత మళ్లీ రెండేళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మిలన్-2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్‌లో వివిధ దేశాలకు సంబందించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్దావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.