శాసనసభలో ఆసక్తికర సంఘటన - మత్స్యకార వేషధారణలో అసెంబ్లీలోకి ఎమ్మెల్యే నాయకర్ - MLA Nayakar Fisherman Getup

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 3:51 PM IST

MLA Narayana Nayakar Fisherman Getup in Assembly : శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ వినూత్న వేషధారణతో అసెంబ్లీకి వచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయన అదే వేషధారణతో, కార్యకర్తలతో కలిసి చేప, వలతో శానసభలో అడుగు పెట్టారు. 

AP Assembly Sessions 2024 : మరోవైపు అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, టీజీ భరత్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌  ప్రమాణం చేశారు. 

అదేవిధంగా పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంసెట్టి సుభాష్‌ తదితరులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.