LIVE: విజయనగరం నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం యాత్ర - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video
LIVE: జగన్ సర్కార్ అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "శంఖారావం" విజయనగరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. మద్యపాన నిషేధం చేసిన తార్వతే ఓట్లు అడుగుతానని జగన్ చెప్పారని, అంతకు ముందు నెల్లిమర్లతో నిర్వహించిన శంఖారాయం యాత్రలో లోకేశ్ అన్నారు. ప్రభుత్వ అధికారులకే టార్గెట్లు విధించి ప్రజల్ని తాగుబోతుల్ని చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలు పన్నుల భారంతో అల్లాడుతున్నారన్న లోకేశ్, తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం రాగానే సంక్షేమ రాజ్యం అందిస్తామని నెల్లిమర్ల శంఖారావం సభలో ప్రకటించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వారి కుటుంబానికి రెండు ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడని ప్రశ్నిస్తే మంత్రులు పిట్టకథలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై కఠిన చర్యలు తప్పవని లోకేశ్ హెచ్చరించారు. గురువారం విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లిలో నిర్వహించిన శంఖారావం సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారైనా తన రెడ్‌బుక్‌లోకి ఎక్కక తప్పదని హెచ్చరించారు.