రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యం: నారా లోకేశ్ - NARA LOKESH CAMPAIGN - NARA LOKESH CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 1:51 PM IST
Nara Lokesh Meeting at Balaji Apartment in Mangalagiri : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని నారా లోకేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బాలాజీ అపార్ట్మెంట్ సభ్యులతో నారా లోకేశ్, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. చంద్రబాబునాయుడు ఎప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారే కానీ హత్య రాజకీయాలను ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. అలాంటి నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అభివృద్ధి చేసే విషయంలో కుల, మతాలను పట్టించుకోలేదని లోకేశ్ పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనందరం మారాలని ఈ సందర్భంగా తెలియజేశారు. యువతకు సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం వల్లే సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి అయిదేళ్లు అవుతున్నా ఒక పరిశ్రమ కూడా రాష్ట్రంలో రాలేదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తనను, పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని లోకేశ్ కోరారు.