LIVE: బొప్పూడిలో 'టీడీపీ-జనసేన-బీజేపీ' సభకు లోకేశ్ భూమిపూజ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 9:43 AM IST
|Updated : Mar 13, 2024, 10:00 AM IST
పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో నారా లోకేశ్ భూమి పూజ చేస్తున్నారు. చిలుకలూరిపేటలో జరగబోయే బహిరంగ సభ ప్రదేశాన్ని మొత్తం తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణం 140 ఎకరాలు కాగా, పార్కింగ్‌కి 60 ఎకరాలు కేటాయించారు. సభకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్తో పాటు పలువురు నేతల రానున్నారు. ఈ సభకు 10 లక్షల పైచిలుకు సభకు బీజేపీ-టీడీపీ-జనసేన తరుపున కార్యకర్తలు హాజరవుతారని తెలిపిన నేతలు హాజరుకానున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి సభకు భూమిపూజ చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కార్యక్రమానికి టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని నిర్ణయించారు. లోకేశ్ నేతృత్వంలో చిలకలూరిపేట బహిరంగ సభ నిర్వహణ కమిటీ సమావేశం ముగిసింది. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతామని తెలిపారు. సమయం తక్కువే ఉన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తామని బీజేపీ ప్రతినిధి సాదినేని యామినీ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటుతామన్నారు. 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖ చిత్రం ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందని జనసేన ప్రతినిధి హరి (Janasena spokesperson Hari) అన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తకుండా 3పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తాయని హరి తెలిపారు.
Last Updated : Mar 13, 2024, 10:00 AM IST