సిద్ధం అంటే 'ప్రశ్నించిన వారిని తన్నడానికి సిద్ధమా'- నారా లోకేష్ - Nara Lokesh Fired on YSRCP Attacks - NARA LOKESH FIRED ON YSRCP ATTACKS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-04-2024/640-480-21136031-thumbnail-16x9-ysrcp-leaders-attack-on-tdp-activists-in-nandigama.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 1:42 PM IST
Nara Lokesh Fired on YSRCP Attacks in Nandigama: సిద్ధం అంటే ఏంటో అనుకున్నా ప్రశ్నించిన వారిని తన్నడానికి సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం కార్యకర్తలపై వైఎస్సార్సీపీ మూకలు చేసిన దాడిని లోకేశ్ ఖండించారు. రాజధాని ఎక్కడని ప్రశ్నించిన వారిపై వైఎస్సార్సీపీ సైకోల దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దాడులు జరగడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం కార్యకర్త నల్లారి కిశోర్, అతని సోదరుడు నరసింహారావుపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు అనుచరులు మంగళవారం దాడి చేశారు. 12వ వార్డులో ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు మద్దతు తెలిపే వారికి ఓట్లు ఎలా వేస్తారని తెలుగుదేశం కార్యకర్తలు ప్రశ్నించడంతో ముందుగానే అక్కడికి చేరుకున్న 15 మంది ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహంతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కిశోర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.