thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 5:59 PM IST

Updated : Apr 30, 2024, 7:33 PM IST

ETV Bharat / Videos

LIVE ఒంగోలులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - nara lokesh election campaigning

Nara lokesh Election campaigning live in ongole : నేటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటి వరకూ తాను పోటీ చేసే మంగళగిరి నియోకజకవర్గంలో ప్రచారం నిర్వహించిన లోకేష్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా యువతతో ఆయన సమావేశాలు నిర్వహించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు అవసరాన్ని వివరించనున్నారు.నేడు ఒంగోలు నుంచి పర్యటనను నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మే 1వ తేదీన నెల్లూరు, 2వ తేదీన రాజంపేట, మే 3న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో, 4న నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తారు. మే 5న చిత్తూరు, మే 6న ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. యువతతో సమావేశాలతో పాటుగా వివిధ ప్రాంతాల్లో లోకేష్ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకూ యువతతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 30, 2024, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.