నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర - నాలుగు రోజుల పాటు పర్యటన - Chandrababu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 12:24 PM IST
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: 'నిజం గెలవాలి' యాత్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుంటూరు, నరసారావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 6వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలో, 7వ తేదీన తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. 8వ తేదీన తాడికొండ నియోజకవర్గంలో, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల వద్దకు ఆమె వెళ్లనున్నారు. కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి, భువనేశ్వరి ఆర్థికసాయం అందించనున్నారు.
ఇందులో భాగంగా తొలుత 6న మంగళగిరిలో పర్యటించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు, అనంతవరప్పాడు గ్రామాల్లో ఈ నెల 7వ తేదీన నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆందోళనకు గురై మృతి చెందిన జె.కోటేశ్వరరావు, నార్నె విజయలక్ష్మిల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు మన్నవ పూర్ణచంద్రరావు తెలిపారు.