ఏపీలో డేటా లీక్​పై ఆధారాలున్నాయి-నిరూపిస్తే, ఎన్నికల నుంచి తప్పుకుంటారా?:ఇండిపెండెంట్ అభ్యర్థి విష్ణువర్ధన్‌ రెడ్డి - YCP Data Leakage - YCP DATA LEAKAGE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 5:15 PM IST

Nandyala Independent Candidate Vishnuvardhan Reddy Comment on YCP Data Leakage : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోప్యంగా ఉండవలసిన ప్రజల డేటాను విచ్చలవిడిగా చేతులు మారుస్తుందని నంద్యాల జిల్లా వైసీపీ కార్యకర్త, నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామినీ విష్ణు వర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటాతో వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తోందని ఆరోపించారు. అందుకే స్థానిక ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చారని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఏపీలో జరుగుతున్న డేటా లీక్ పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని కామినీ విఘ్ణ వర్థన్​ రెడ్డి స్పష్టం చేశారు. డేటా లిక్ చేస్తున్న విషయాన్ని తాము వైసీపీ నేతల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డేటా లీక్ సంబంధించిన వివరాలను తాను ఆధారాలతో చూపిస్తే వైసీపీ నేతలు, సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఎన్నికల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. డేటా లిక్ కు సంబంధించిన విషయాలపై మరింత సమాచారంతో ప్రజల్లోకి తీసుకువెళ్తానని సృష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.