రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన బాలకృష్ణ - అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు - Balakrishna Election Campaign - BALAKRISHNA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 10:59 AM IST
Nandamuri Balakrishna Ready for Election Campaign: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర ప్రారంభించనున్నారు. తెలుగుదేశం గెలుపే లక్ష్యంగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కళ్యాణమండపంలో ఎస్టీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కదిరి నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు.
వెళ్లే దారిలో నల్లమాడ మండలం బొగ్గలపల్లిలో పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బాలకృష్ణకు ఘనస్వాగతం పలకనున్నారు. కొత్తచెరువు ప్రధాన కూడలిలో నందమూరి బాలకృష్ణ రోడ్ షో నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రకృతి వనరులను దోచుకున్న వైనంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలకు వివరించనున్నారు. ఒక్క ఛాన్సు అంటూ పేదలు, నిరుద్యోగులు, మహిళలు, మైనార్టీలను దగాచేసిన తీరుపై బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో చెప్పనున్నారు. బాలకృష్ణ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు జిల్లా నేతలు తెలిపారు.