LIVE: శింగనమలలో 'స్వర్ణాంధ్ర సాధికార యాత్ర' - పాల్గొన్న నందమూరి బాలకృష్ణ - ప్రత్యక్ష ప్రసారం - Balakrishna Election Campaign - BALAKRISHNA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 5:35 PM IST
|Updated : Apr 14, 2024, 5:57 PM IST
Balakrishna Election Campaign Live : టీడీపీ అధికారం చేపట్టాక కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం కదిరిలో స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జీవిమాను కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టదైవమని, దుష్ట శిక్షణకు వెలసిన స్వామి దర్శనంతో వైకాపా పాలన అంతానికి సైకిల్ రావాలి - స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారానికి చెర్లోపల్లి రిజర్వాయరు నుంచి సరఫరా చేస్తామని, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామని పేర్కొన్నారు. రోడ్డుషోకు ముందు పీవీఆర్ ఫంక్షన్‌హాల్‌లో కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీల కోసం టీడీపీ ముందుండి పనిచేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తెదేపా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే ముస్లింలకు ఉన్న బీసీ-ఇ రిజర్వేషన్ రద్దు చేస్తారంటూ అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీతోనే ముస్లింలకు ఎంతో మంచి జరిగిందన్నారు. ప్రస్తుతం శింగనమలలో 'స్వర్ణాంధ్ర సాధికార యాత్ర'లో నందమూరి బాలకృష్ణ పాల్గొని ప్రసంగిస్తున్నాురు. ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Apr 14, 2024, 5:57 PM IST