ఘనంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు - అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్న భక్తులు - jadala ramalingeswara Swamy Jatara
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 12:00 PM IST
Nalgonda Cheruvugattu Jatara 2024 : నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సమేతంగా ఉన్న స్వామిని పర్వత వాహనంపై మంగళ వాద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం వీరముష్టి వంశీయులుతో మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమం ప్రారంభించారు.
Cheruvugattu Temple Brahmotsavam 2024 : భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీస్, అగ్నిమాపక శాఖలు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. భక్తులు హరహర శంభో నామస్మరణలతో నిప్పుకనిల (అగ్ని గుండాలు)పై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. పంటను స్వామికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివసత్తులు అగ్నిగుండాల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ అధికారులు పాల్గొన్నారు.