Pawan LIVE: చేబ్రోలు బహిరంగ సభలో పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - pawan kalyan latest - PAWAN KALYAN LATEST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 9:08 PM IST
|Updated : Mar 30, 2024, 9:23 PM IST
Pawan kalyan Live : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు నాలుగు రోజుల పాటు పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఇదే కావడం గమనార్హం. అనంతరం ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని మనోహర్ వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలతో దూసుకెళ్తుండగా పార్లమెంట్, నియోజకవర్గ అభ్యర్థులు సైతం ప్రచార జోరు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతూ హామీల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చేబ్రోలు బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Mar 30, 2024, 9:23 PM IST