ETV Bharat / state

రూ.70 వేలు వసూలు చేసి రూ.300 దర్శనం - తిరుమలలో కానిస్టేబుల్​ మోసం - CONSTABLE SALE DARSHAN TICKETS

రూ. 70 వేలు వసూలు చేసి రూ. 300 దర్శనం టికెట్లు ఇచ్చిన కానిస్టేబుల్​ - భక్తుల ఫిర్యాదుతో కేసు నమోదు

CONSTABLE SALE BREAK DARSHAN TICKETS TIRUMALA
Tirumala Police has Registered A case Against The Constable (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 5:16 PM IST

Updated : Dec 20, 2024, 6:49 PM IST

Constable Sale Darshan Tickets In Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శనాలు కల్పిస్తానని చెప్పి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు ఇచ్చిన ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్​పై తిరుమలలో కేసు నమోదైంది. బెంగుళూరుకు చెందిన హరిబాబు, చంద్రశేఖర్ అనే రెండు కుటుంబాల వద్ద నుంచి బోర్డర్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.

అసలేం జరిగిందంటే: అనంతపురానికి చెందిన ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫార్సు లేఖపై ఆరు టికెట్లపై యాభై వేల రూపాయలు, అరకు ఎమ్మెల్యే రేగం ముత్యలింగం సిఫార్సు లేఖపై ఇరవై వేల రూపాయలు భక్తుల నుంచి చంద్రశేఖర్​ తీసుకున్నాడు. భక్తులకు బ్రేక్ దర్శనం అని చెప్పి రూ. 300 ప్రత్యేక దర్శనం కల్పించాడు. దీంతో భక్తులు తాము మోసపోయామని గ్రహించారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విజిలెన్స్​ అధికారులకు ఫిర్యాదు చేశారు.

భక్తుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు చంద్రశేఖర్​పై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్​పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపడతామని తిరుమల రెండోవ పట్టణ పోలీసు అధికారి సీఐ శ్రీరాములు తెలిపారు.

''ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై వచ్చిన టికెట్లను రూ.70 వేలకు కానిస్టేబుల్ చంద్రశేఖర్ భక్తులకు అమ్మాడు. దీనిపై భక్తులు, విజిలెన్స్​ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం'' -శ్రీరాములు, తిరుమల రెండో పట్టణ సీఐ

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - దర్శించుకున్న నటి రాధిక

తిరుమలలో కడియం కొన్న భక్తుడు- రూంకి వెళ్లి చూసి షాక్​!

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్​ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?

Last Updated : Dec 20, 2024, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.