బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మయన్మార్ దేశస్థుల ఆందోళన - Myanmar Citizens protest for murder
🎬 Watch Now: Feature Video


Published : Jan 29, 2024, 10:22 PM IST
Myanmar Citizens protest Against Murder : ఈ నెల 28న భాగ్యనగరంలో హత్యకు గురైన మయన్మార్ దేశస్థుడు ఇబ్రహీంకు న్యాయం చేయాలంటూ ఆ దేశ పౌరులు నిరసన చేశారు. తమ దేశంలో హింసలు, అఘయిత్యాలు జరుగుతున్నాయని భారతదేశానికి వస్తే ఇక్కడ కూడా అవే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు రక్షణ బలగాలతో ఘటనా సల్థానికి చేరుకున్నారు.
మయిన్మార్ దేశస్థులు చేస్తున్న నిరసనను ఆపే క్రమంలో సివిల్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీశైలం తలకు గాయం అయింది. అనంతరం స్థానిక, మయన్మార్ దేశస్థుడు, రాజకీయ నేత అంజదుల్లాహ్ ఖాలేద్ సహాయంతో పోలీసులు నిరసకారులను శాంతింప చేశారు. చివరికి మయన్మార్ దేశస్థులు ఇబ్రహీం మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.
అసలేం జరిగిదంటే : ఆదివారం రోజున అసిఫ్ అనే రౌడీ షీటర్ ఇబ్రహీం అనే మయన్మార్ దేశస్థుడిని హత్య చేశాడు. ఆసిఫ్ పదిరోజుల క్రితం తన అనుచరుడితో కలిసి ఇబ్రహీం మొబైల్‌ను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆదివారం అసిఫ్, ఇబ్రహీం ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇబ్రహీం తన మొబైల్‌ఫోన్ ఇవ్వాలంటూ అసిఫ్‌ను అడిగాడు. దీంతో అసిఫ్ కత్తి తీసి ఇబ్రహీంని పొడిచాడు. దీంతో ఇబ్రహీం అక్కడికక్కడే మృతి చెందాడు.