వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం- అక్రమ లేఅవుట్లపై ఇరుపార్టీల నేతలు ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 5:01 PM IST
Municipal Council Meeting in Jaggaiyapet : కాకినాడ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. స్థానిక అక్రమ లేఅవుట్లపై టీడీపీ, వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసున్నారు. మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఇరుపక్షాల సభ్యులు పట్టణంలో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ లేఅవుట్ల గురించి చర్చించారు. దీని వల్ల పట్టణంలోని ప్రజలు నష్టపోతున్నారని ఛైర్మన్‌కు తెలియజేశారు.
పురపాలక సంఘానికి రావాల్సిన స్థలాలను ఇవ్వకుండా, ప్రజలకు వసతులు కల్పించకుండా వారిని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్ల అధికార పార్టీ వారిపై ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసి కేవలం కాగితాలపై మ్యాపులు వేసి స్థలాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇంజనీరింగ్ శాఖ పనుల నిర్మాణాల్లో చేస్తున్న అధికారుల అలసత్వంపై విపక్షాల సభ్యులు ధ్వజమెత్తారు. అక్రమ లేవుట్లకు ఏ పార్టీ సభ్యులైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాలని ఇరుపార్టీల సభ్యులు సృష్టం చేశారు.