ETV Bharat / state

కురుస్తున్న వర్షాలు - నీట మునిగిన పంటలు - RAINS IN AP DUE TO CYCLONE FENGAL

తుపాను ప్రభావం తగ్గినా ఆగని వానలు - నీట మునిగిన పంటలు - ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు

rains_in_ap_due_to_cyclone_fengal
rains_in_ap_due_to_cyclone_fengal (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 7:20 PM IST

Rains in AP Due to Cyclone Fengal : ఫెయింజల్‌ తుపాను ప్రభావం తగ్గినా పలు జిల్లాల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల వర్షాలకు పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో వరి పంటకు నష్టం వాటిల్లింది. మళ్లీ నారుమడులు వేసేందుకు ప్రభుత్వమే విత్తనాలు సరఫరా చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో అధికారుల అలసత్వంతో ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన హోంమంత్రి అనిత రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఫెయింజల్‌ తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలిచింది. కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు మండలాల్లో వరి నారు దెబ్బతింది. కొన్నిచోట్ల పాచిపడుతోంది. అల్లూరు డెల్టా ప్రాంతంలోనే 400 ఎకరాల్లో నాట్లు దెబ్బతిన్నాయి. కోవూరు నియోజకవర్గంలోని 1.1 లక్షల ఎకరాల్లో వరి వేయగా 60 శాతం పొలాల్లో నీరు నిలబడి ఉంది. నీటిని బయటకు పంపించే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ విత్తనాలు పోసుకుని, నార్లు వేయాలంటే తమ వల్ల కాదని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తీవ్ర వాయుగుండంగా మారనున్న తుపాను- పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్​లకు అవకాశం

తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందని చెబుతూ కొనుగోలు చేయట్లేదని, ఆరబోస్తే ఎండ రావట్లేదని అంటున్నారు. మిల్లర్లు కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు, చిట్వేలి, కోడూరు మండలాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైల్వేకోడూరులోని గుంజన ఏరు, ఓబులవారిపల్లె మండలంలో ఎర్ర కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామాలను కలిపే చిన్న చిన్న రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారుల్లోని స్వర్ణముఖి నది కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తోంది. రాజుల కండ్రిగ పాఠశాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయుడు రత్నకుమార్‌ బైక్‌పై వెళ్తుండగా గోవిందవరం సమీపంలో బైక్‌ వరదలో కొట్టుకుపోయింది. స్థానికులు గుర్తించి ఉపాధ్యాయుడిని కాపాడారు.

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చి ముంపునకు గురైన ప్రభావిత గ్రామాల ప్రజలు, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో వర్షాల ధాటికి కొండచరియలు జారిపడుతున్న దృష్ట్యా భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రతపై పట్ల దృష్టి పెట్టాలని సూచించారు.

రైతులను వణికిస్తున్న ఫెయింజల్​ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.