రోడ్లు అధ్వానంగా ఉన్న విషయం వాస్తవమే- ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించిన ఎంపీ విజయసాయిరెడ్డి - AP Latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 10:26 AM IST
MP Vijayasai Reddy on Damaged Roads: గుంటూరు జిల్లా మంగళగిరిలో రోడ్లు అధ్వానంగా ఉన్న విషయం నిజమేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించారు. రోడ్లు బాగోలేని విషయం నిజమేనని, తాను ప్రత్యక్షంగా చూశానని స్పష్టం చేశారు.
Roads Condition in Mangalagiri Constituency: నియోజకవర్గంలో బాగోలేని రహదారులకు రాబోయే 25రోజుల్లో మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని దుగ్గిరాలలో పార్టీ కార్యాలయాన్ని విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) ప్రారంభించారు. వారం రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి(Mangalagiri YSRCP MLA Candidate)ని ప్రకటిస్తామని చెప్పారు. చేనేత వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా ఎంపిక చేస్తామన్నారు.
"మంగళగిరిలో రోడ్లు బాగోలేవు.. నిజమే. రోడ్లు, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. బాగోలేని రహదారులు ప్రత్యక్షంగా చూశా. రాబోయే 20-25 రోజుల్లో రోడ్లు మరమ్మతులు చేయిస్తాం. వారం రోజుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటిస్తాం. చేనేత వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా ఎంపిక చేస్తాం." - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ