LIVE పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేనలో చేరుతున్న ఎంపీ బాలశౌరి- ప్రత్యక్షప్రసారం - జనసేనలో చేరుతున్న ఎంపీ బాలశౌరి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 6:52 PM IST
|Updated : Feb 4, 2024, 7:39 PM IST
MP Vallabhaneni Balashauri joining Jana Sena Live: పవన్ కల్యాణ్ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Machilipatnam MP Vallabhaneni Balasowry) తెలిపారు. పవన్ కల్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందరు పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలోని ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. పోలవరం, స్టీల్‌ప్లాంట్‌పై పవన్‌తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బాలశౌరి అన్నారు. ఎమ్మెల్యే పేర్నినానితో విసిగిపోయిన స్థానిక నేతలు ఎంపీ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నారు. అధికార పార్టీ నిర్ణయాలతో, స్థానిక ఎమ్మెల్యేలతో విసిగిపోయిన ఎంపీలు, నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలశౌరి చేరిక కార్యక్రమం ప్రత్యక్షప్రసారం.