దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి: రఘురామకృష్ణ రాజు - నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 6:50 PM IST

MP Raghurama Krishna Comments On YCP Government: సైకాసురుడు అయినటువంటి జగన్​ను గద్దె దించేందుకు తెలుగుదేశం- జనసేనలతో జత కడుతున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. కూటమి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్​లు కృష్ణార్జునుల్లా అభినవ కౌరవులైన వైసీపీ అభ్యర్థులైన 151మందిని ఎన్నికల సంగ్రామంలో తుదముట్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తును విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల తెలుగుదేశం- జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం- జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ఏర్పాటు చేసిన ప్రచార సమరశంఖం సభకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన పేర్కొన్నారు. మూడు రాజధానులని చెప్పి వాటి అడ్రస్సే లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్ర పుటల్లో కలిసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారని రఘరామ ఎద్దేవా చేశారు. కూటమి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ఈ సభా వేదికగా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.