ETV Bharat / state

బర్డ్‌ ఫ్లూ అలర్ట్ - చికెన్ దుకాణాలు మూసివేత - రంగంలోకి రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు - BIRD FLU ALERT

పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికారులు - ఇన్ఫెక్షన్ జోన్‌గా పౌల్ట్రీ ఫాం నుంచి కిలోమీటర్‌ ప్రాంతం

BIRD FLU ALERT
BIRD FLU ALERT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 4:35 PM IST

BIRD FLU ALERT: కోళ్లకు బర్డ్​ ఫ్లూ లక్షణాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైరస్ అరికట్టేందుకు అన్ని రకాల అత్యవసర చర్యలను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పెదఅమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ నిర్ధారణ అయిన కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్​ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా గుర్తించారు.

17 గ్రామాల్లో చికెన్ అమ్మకాలను నిషేధించారు. వాటిలో కొమరవరం, అత్తిలి, కావలిపురం, ఇయెర్ చెరువు, గోటేరు, మండపాక, ఇరగగవరం, తేతలి, రేలంగి గుమ్మంపాడు, పాలి, ఒరిగేడు, బల్లిపాడు, తనుకియు, మల్లిపాడు, అర్జునిడిపాలెం ఉన్నాయన్నారు. ఈ పరిధిలోని అన్ని చికెన్ దుకాణాలు, గుడ్డులు దుకాణాలు మూసివేయడానికి ఆదేశించినట్లు తెలిపారు.

ఇన్ఫెక్షన్ జోన్‌లోని అన్ని కోళ్లను తొలగించి పూడ్చి పెట్టడానికి ఆదేశించారు. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేయడం జరుగుతుందని, ఇన్ఫెక్షన్ జోన్ నుంచి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా గుర్తించడం జరిగిందన్నారు. ఈ పరిధిలోని అన్ని చికెన్, గుడ్ల దుకాణాలు మూసివేయడానికి ఆదేశించినట్లు తెలిపారు. వ్యాధి సోకిన పరిధిలో కోళ్లు, గుడ్ల రవాణా పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. వెటర్నరీ డాక్టర్, ఇతర సిబ్బందితో కలిపి 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి, వారి పర్యవేక్షణలో కోళ్ల తొలగింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల కదలికపై పోలీసు శాఖ నిఘా ఉంచాలన్నారు. అడవి, వలస పక్షుల మరణాలు ఆ ప్రాంతంలో ఏమైనా జరిగితే పరిశీలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు.

కిలోమీటర్ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు: ఇక తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామం పౌల్ట్రీ పారాలలో సైతం బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే విధంగా నిడదవోలు, కొవ్వూరు,పెరవలి పరిసర మండలాల్లోనూ సుమారు 62 వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం. వీటి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. వ్యాధి నిర్ధారణ అయిన ఫారాల వద్ద కిలోమీటర్ పరిధిలో ఇన్ఫెక్షన్​ జోన్​గా ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు.

పది కిలోమీటర్ల పరిధిలో చికెన్, కోడిగుడ్ల అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలను మూయించి వేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. పౌల్ట్రీ ఫారాల వద్ద పరిస్థితులను ఆరా తీశారు. అధికారులు తీసుకునే చర్యలకు ప్రజలంతా సహకరించాలని, కొద్దిరోజుల పాటు చికెన్, కోడిగుడ్లు తినటం మానేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి శాంతమణి విజ్ఞప్తి చేశారు.

కోళ్ల మరణాలకు ఆ వైరస్ కారణం - చికెన్, గుడ్లు తినొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.