కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్తో పాటు బాధ్యులందర్నీ అరెస్టు చేయాలి: ఎంపీ కేశినేని - Kesineni Visit Flood Affected Areas - KESINENI VISIT FLOOD AFFECTED AREAS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2024, 4:04 PM IST
MP Kesineni Chinni Visits FloodAffected Areas : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్తో పాటు బాధ్యులందర్నీ అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబును ఎంపీ కేశినేని చిన్ని కోరారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల కొండపై అనేక అవినీతి అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఆయన ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. వరద బాధితులకు గురువారం నుంచి పరిహారం పంపిణీ చేస్తామన్నారు.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ జగన్ బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో జగన్ లడ్డు కల్తీ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చర్చి, మజీద్, దేవాలయాలపై దాడులు చేసిన దుండగులను శిక్షించాలన్నారు. వైఎస్సార్సీపీ అవినీతి శృతిమించి దేవుని ప్రసాదాన్ని కల్తీ చేశారని మండిపడ్డారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు.