ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌లో 340 కేసులు- దొంగ రిజిస్ట్రేషన్లతో ఫెడరేషన్లు:కేశినేని - Kesineni on AP Olympic Association - KESINENI ON AP OLYMPIC ASSOCIATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 4:49 PM IST
MP Kesineni About AP Olympic Association : ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వైఎస్సార్సీపీ నేతల కబ్జాలోనే చిక్కుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మొత్తం 34 ఫెడరేషన్లలో దొంగ రిజిస్ట్రేషన్లు చేశారన్నారు. ఈ అక్రమాల్లో నలుగురు వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల 340 కేసులతో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌కు చీడ పట్టిందని ధ్వజమెత్తారు. త్వరలోనే మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి సుభాష్‌తో కలిసి ఎంపీ చిన్ని వినతులు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా భూ అక్రమాలు జరిగినట్లు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్న ఎంపీ సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా భూ అక్రమాలు జరిగాయని, అగ్రీగోల్డ్, దేవాదాయ, చెరువులు ఇలా వేటినీ వైఎస్సార్సీపీ నేతలు వదల్లేదని మండిపడ్డారు. ప్రతీ ఫిర్యాదును పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.