ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక - తర్వాత చెబుతానంటూ దాటవేత - జనసేనలో వైసీపీ ఎంపీ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 11:21 PM IST
MP Balasouri Joins in Janasena: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి బాలశౌరి వెళ్లారు. సుమారు 2 గంటలకుపైగా బాలశౌరి పవన్‌తో భేటీ అయ్యారు. బాలశౌరి జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న వేళ, పవన్ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ తో సమావేశం ముగిసిన తర్వాత బయటికి వచ్చిన బాలశౌరిని మీడియా ప్రశ్నించగా, జనసేనలో చేరికపై తర్వాత చెబుతానంటూ వెళ్లిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే బాలశౌరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆయన వైఎస్సార్సీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరతారనే కుతుహలం రాజకీయ వర్గాల్లో ఉండిపోయింది. పార్టీకి రాజీనామా చేసిన రోజున ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో ఆయన పవన్‌తో భేటి కావడం ఆ ప్రచారానికి ఆజ్యం పోసినట్లైంది. కానీ, ఆయన జనసేనలో చేరికపై ఎటువంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో బాలశౌరి ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ ఇంకా వీడలేదు.