ఎన్నికల అధికారుల పడవ ప్రయాణం- 481 ఓట్ల కోసం - Distribute Election Materials

🎬 Watch Now: Feature Video

thumbnail

Moving of Election Materials by Boat in Mummidivaram: మరికొన్ని గంటల్లో పోలింగ్​ ప్రక్రియ మొదలవబోతున్న నేపథ్యంలో అధికారులు ఎన్నికల సామాగ్రిని తీసుకొని ఆయా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగానే కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రానికి ఎట్టకేలకు అతి కష్టం మీద ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. బలుసుతిప్ప నుంచి నాటు పడవపై సముద్రతీరానికి చేరువలో ఉన్న ఇంజన్‌ బోట్‌ బోర్డు వద్దకు అతి కష్టం మీద చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరి నది పాయల మధ్య ఉన్న మగసానితిప్పకు బోటులో చేరుకున్నారు. 

అక్కడ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చేపల వేటకు వచ్చి స్థిరపడిన వారు ఉండటంతో వారికి ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది. ఆ గ్రామంలో మొత్తం 481 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎట్టకేలకు అతి కష్టం మీద ఎన్నికల సామాగ్రితో సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. తాళ్లరేవు మండలం పొంగల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇక్కడ 714 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.