ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం- 'ఐ లవ్​ గుడివాడ' కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము - Clean Gudivada - CLEAN GUDIVADA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 2:17 PM IST

MLA Venigandla Ramu Conduct I LOVE Gudivada Programme: కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము "ఐ లవ్​ గుడివాడ" కార్యక్రమం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని భావించి ఈ కార్యక్రమం రూపొందించామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై రోడ్ల వెంబడి ఉన్న టీ స్టాల్స్, తోపుడు బండ్ల నిర్వాహకులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త సేకరణలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎంతో పేరుగాంచిన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని రాము పేర్కొన్నారు. ప్రజల్ని చైతన్యం చేసి పట్టణాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఇంటితో పాటు, పరిసరాలను సైతం ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్తను వేస్తుండటంతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు కూడా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తను వేసే అలవాటు మార్చుకొని పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.