దాడుల సంస్కృతి తమది కాదు- ప్రజల్ని హింసించినప్పుడు ఈ భయం తెలియలేదా: సోమిరెడ్డి - MLA Somireddy on Jagan - MLA SOMIREDDY ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 4:50 PM IST
MLA Somireddy on Jagan Accusation of TDP Attack on YSRCP: వైఎస్సార్సీపీ నాయకులపై తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరచకాలు, దౌర్జన్యాలు, దాడులు సృష్టించింది వైఎస్సార్సీపీనే అని అరోపించారు. వై నాట్ 175 అని ప్రగల్భాలు పలికిన వైఎస్సార్సీపీకి కనీసం ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా ప్రజలు చెంప దెబ్బ కొట్టారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ పాలనలో అరచకాలకు సృష్టికరైన అయిన రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి జవహార్ రెడ్డిని రాష్ట్రం నుంచి వెళ్లకుండా చూడాలని గవర్నర్ను సోమిరెడ్డి కోరారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక తాము గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరక ముందే వైఎస్సార్సీపీ నేతలు రాజ్ భవన్కు పరిగెత్తటం హాస్యాస్పదమన్నారు. దాడుల సంస్కృతి తమది కాదని గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యాసలో తాముంటే, వారి దాడుల గోలేంటి అని సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజల్ని నరికి, నరికి, హింసించినప్పుడు ఈ భయం తెలియలేదా అని దుయ్యబట్టారు.