మదనపల్లిలో ఆఫీసుకు నిప్పంటించారు- సర్వేపల్లిలో కోర్టులో ఫైళ్లు మాయం చేశారు : సోమిరెడ్డి - MLA SOMIREDDY - MLA SOMIREDDY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 12:12 PM IST

MLA Somireddy Chandra Mohan Reddy Post on Twitter : రాష్ట్రంలో ప్రస్తుతం పాలన ప్యాలెస్ నుంచి ప్రజల వద్దకు చేరిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ ప్యాలెస్​ పాలనతో ప్రజలు దారుణమైన పరిస్థితులు అనుభవించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన ప్రజల చెంతనే ఉంటుందని ఆయన అన్నారు. మదనపల్లి ఫైల్స్ ఘటనలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెడితే సర్వేపల్లిలో ఏకంగా కోర్టులో ఫైల్స్​నే మాయం చేశారని ఆయన ఆరోపించారు.  

ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు బంద్ చేయడం, చేతులు మారిన భూములపై విచారణ జరపడం ల్యాండ్ మాఫియాకు షాక్ తగిలిందని సోమిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు మరో స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్​లో సోమిరెడ్డి పోస్ట్ చేశారు. ఇలాంటివన్నీ ఈ నెల 15వ తేదీ నుంచి మొదలయ్యే ప్రజల వద్దకు పాలన సదస్సులతో వెలుగులోకి రానున్నాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలతో పాప ప్రక్షాళన జరగబోతుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.