దర్యాప్తు అధికారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు - హైకోర్టులో పిన్నెల్లి - Pinnelli Lunch Motion Petition - PINNELLI LUNCH MOTION PETITION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 7:07 PM IST
Pinnelli Ramakrishna Reddy Lunch Motion Petition: సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్ మిషన్ ద్వంసం, టీడీపీ కార్యకర్తలపై దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ పిన్నెల్లి పిటిషన్లో పేర్కొన్నారు. లంచ్ మోషన్ను అనుమతించిన న్యాయస్థానం పిటిషన్పై విచారణ జరిపింది. దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీను కూడా మార్చాలంటూ పిన్నెల్లి పిటిషన్లో కోరారు.
ఇప్పటికే పిన్నెల్లిని మాచర్ల వెళ్లొద్దని హైకోర్టు ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల 6 వరకు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది.