టీడీపీపై వ్యతిరేకత పెంచేలా మేయర్ కుట్ర: ఎమ్మెల్యే మాధవీరెడ్డి - MLA Madhavi Reddy Fire On Mayor - MLA MADHAVI REDDY FIRE ON MAYOR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 4:36 PM IST

MLA Madhavi Reddy Fire On Kadapa Mayor Suresh Babu : కడప కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకూడదని మేయర్ పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశాలు ఇస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ పైన ప్రజల్లో వ్యతిరేకత కలిగించడానికి మేయర్ సురేష్ బాబు కొత్త నాటకానికి తెరలేపారని ఆక్షేపించారు. చెత్త సేకరణకు వెళ్లకుండా దశల వారిగా వాహనాలు తగ్గించేందుకు మేయర్ కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. 

ప్రజలు ప్రశ్నిస్తే తన పేరు చెప్పి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరి పన్నాగాలను ప్రజలు గమనించాలని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని మాధవీరెడ్డి హితవు పలికారు. ఇళ్ల వద్ద చెత్త నిల్వలు పేరుకుపోతే ఆ బాధ్యత మేయర్, కార్పొరేటర్లదేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చెత్త పన్ను వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కానీ కార్పొరేషన్ పరిధిలోని వాహనాలను చెత్త సేకరించడానికి వెళ్లకుండా దశలవారీగా వాహనాలు తగ్గించేందుకు మేయర్ కుట్ర పన్నడం తగదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.