thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 12:14 PM IST

ETV Bharat / Videos

ఎమ్మెల్యే మద్దిపాటి మంచి మనసు - చదువుకున్న స్కూల్​కు మొదటి నెల జీతం విరాళం - MLA donated first month salary

TDP MLA Maddipati Venkata Raju Donated Salary: చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉందని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి నెల జీతాన్ని తాడేపల్లిగూడెం మండలంలోని ఆరుగొలను గురుకుల పాఠశాలకు అందజేశారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత వచ్చిన మొదటి జీతాన్ని ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు తనకు స్కూల్​ గుర్తుకు వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. 

ఆరుగొలను పాఠశాలలో చదవడం వలనే తాను ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తమను ఉపాధ్యాయులు వారి సొంత బిడ్డల్లా చూసుకునేవారని నాటి మధుర స్మృతులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు గుర్తు చేసుకున్నారు. ఈ సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే పోరాడటాన్ని ఇక్కడే నేర్చుకున్నానని పేర్కొన్నారు. అందుకే తన మొదటి నెల జీతాన్ని తాను చదువుకున్న పాఠశాలకు ఇచ్చానన్నారు. అదే విధంగా భవిష్యత్తులోనూ నిరుపేద విద్యార్థుల కోసం అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుకు పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.