'అగ్నికుల క్షత్రియులను అవమానించిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి' - Agnikul Kshatriyas Demand

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 7:05 PM IST

MLA Dwarampudi Chandrasekhar Reddy Insulted Agnikul Kshatriyas in Prakasam District : అగ్నికుల క్షత్రియులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్​ రెడ్డిపై ఆ సంఘం నాయకురాలు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నికుల క్షత్రియ జాతికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. వైసీపీ నాయకులు తమ ఓటు బలంతోనే గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కులం పేరుతో దూషించటం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

Agnikul Kshatriyas Demand : రానున్న ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్​ రెడ్డికి టికెట్​ ఇస్తే మత్స్యకారులందరూ వైసీపీ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు కృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో మత్స్యకారులందరూ ఏకం అయ్యి వైసీపీ ఓటమికి కృషి చేస్తామని పేర్కొన్నారు. చంద్రశేఖర్​ రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తక్షణమే తమ కులానికి బహిరంగంగా చంద్రశేఖర్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.