రాజమహేంద్రవరంలో అదరగొట్టిన ఫ్యాషన్ షో- క్యాట్ వాక్‌తో హొయలొలికించిన ముద్దుగుమ్మలు - Miss Rajamahendravaram Grand Final - MISS RAJAMAHENDRAVARAM GRAND FINAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 3:05 PM IST
Miss Rajamahendravaram Grand Final: అందమంటే మగువ.. మగువ అంటేనే అందం. అలాంటిది వాళ్లు ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తే మతి పోవాల్సిందే! చూడచక్కగా ముస్తాబైన ముద్దుగుమ్మలు నడకలతో హొయలొలికిస్తుంటే రెండు కళ్లూ చాలవంతే. రాజమహేంద్రవరంలో నిర్వహించిన అందాల పోటీలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్ రాజమహేంద్రవరం గ్రాండ్ ఫైనల్స్‌లో ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఫ్యాషన్ షో వీక్షకులను కట్టిపడేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రాండ్ ఫైనల్స్‌లో పాల్గొన్న అందాల భామలు ర్యాంప్‌పై క్యాట్ వాక్‌తో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ఒకరు మించి మరొకరు అనే విధంగా తమతైన స్టైల్లో తమ అందాలను ఒలకబోశారు. రంగురంగుల అధునాతన దుస్తులను ధరించి అందాల భామల నడకలు స్టెప్పులతో మైమరపించారు. నేటి యువతరం అభిరుచులు, జీవనశైలి, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ ఫ్యాషన్ షో కొనసాగింది. ఈ ఫ్యాషన్ షో లో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.