నెల్లూరు సమస్యలపై మంత్రుల సమీక్ష- అభివృద్ధి ప్రణాళికలపై చర్చ - Ministers Review - MINISTERS REVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 10:17 AM IST
Ministers Review Nellore District Development Issues : ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు సృష్టం చేశారు. నారాయణ మెడికల్ కళాశాలలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో ఆగిపోయిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికపై చర్చించారు. నగరంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అన్న క్యాంటీన్లు, టిడ్కో గృహాలు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి అందరం సమన్యయంతో కృషి చేస్తామని మంత్రి ఆనం నారాయణరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహనకు వచ్చామని తెలియజేశారు. జిల్లాలోని సోమశిల ప్రాజెక్ట్, తెలుగు గంగ ప్రాజెక్ట్‌లో నీరు నిల్వ చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.