LIVE: సూర్యాపేట జిల్లాలో మంత్రుల పర్యటన - ప్రత్యక్షప్రసారం - Ministers in Narayanpet Live
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-03-2024/640-480-20973990-thumbnail-16x9-minister-visit-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 13, 2024, 12:41 PM IST
|Updated : Mar 13, 2024, 4:36 PM IST
Ministers Live : రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రులు కోదాడలో రూ.53 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు, నల్గొండలో రూ.55 కోట్లతో రోడ్లు, డ్రైనేజ్‌లకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపేట వెళ్లి అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సంగంబండ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని తెలిపారు. మక్తల్ నుంచి వచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్న మంత్రి ఉత్తమ్ గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా పైసల కోసం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు. ఐదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, భీమా, కోయల్‌సాగర్ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు హామీ ఇచ్చారు.
Last Updated : Mar 13, 2024, 4:36 PM IST