LIVE : కాళేశ్వరం ఆనకట్టలను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ - Minister Uttam Visit Kaleswaram Barrages Live - MINISTER UTTAM VISIT KALESWARAM BARRAGES LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 3:49 PM IST

Updated : Jun 7, 2024, 4:11 PM IST

Minister Uttam Visit Kaleswaram Barrages Live : కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతులతోపాటు రక్షణ చర్యలకు సంబంధించిన పనులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇంజినీర్లతో కలిసి ఆయన తొలుత మేడిగడ్డ బ్యారేజీని చెక్ చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరగుతున్న పనులను పరిశీలిస్తారు. అదేవిధంగా ఇంజినీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై పనుల పురోగతిని సమీక్షించనున్నారు. మరోవైపు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో కీలకమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. ఏడో బ్లాకులోని ఎనిమిది గేట్లకుగాను ఒకటిని గతంలోనే ఎత్తగా, కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కటింగ్ ద్వారా తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో గురువారం రెండింటిని తెరిచారు. 16, 17వ గేట్లను ఎత్తినట్లు ఇంజినీర్లు తెలిపారు.
Last Updated : Jun 7, 2024, 4:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.