రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్‌దే : ఉత్తమ్ కుమార్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 5:10 PM IST
Minister Uttam Kumar Reddy Sensational Comments on KCR : తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. రూ.95,000 కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశాన్ని ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, హరీశ్‌రావు పదే పదే మాట్లాడి ప్రజల్లో ఒక అపోహ కలుగజేస్తున్నారని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.
ఈ విషయంలో ఎవరేం మాట్లాడుకున్నా, కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. వీటిపై త్వరలో జరగనున్న శాసనసభలో చర్చ జరుపుతామని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కృష్ణానదీ జలాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఏకాంత చర్చల్లో మాట్లాడుకొని, తెలంగాణ జలాలను ఆంధ్రాకు తరలించటానికి కుట్రలు చేశారన్నారు. ఈ ఒప్పందాల్లో భాగంగానే గ్రావిటీ ద్వారా కృష్ణానదిలో వచ్చే 8 టీఎంసీల నీటిని సైతం కేసీఆర్ వదులుకున్నారని మంత్రి వివరించారు.