జలసౌధ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - Minister Uttam at JalaSoudha
🎬 Watch Now: Feature Video
Published : Feb 28, 2024, 6:13 PM IST
|Updated : Feb 28, 2024, 6:52 PM IST
Minister Uttam Kumar Reddy Pressmeet Live : హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అంతకు ముందు చిన్నకాళేశ్వరం ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. జలసౌధ కార్యాలయంలో జరిగిన ఈ రివ్యూ సమావేశంలో అధికారులు, ఇంజినీర్లతో హాజరయ్యారు. చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మంథని నియోజకవర్గంలో ఉన్న చిన్నకాళేశ్వరంలో ఈ ఎత్తిపోతల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలకు మరమ్మతులపై కూడా మంత్రి అధికారులతో చర్చించారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక, తాజాగా ఇంజినీరింగ్ అధికారుల బృందం ఇచ్చిన మరమ్మతుల రిపోర్టుల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అప్పటిలోగా పూర్తి చేసే విషయంలో ఎదురయ్యే సవాళ్లు, అడ్డంకులు, నిధుల మంజూరుపై చర్చించినట్లు సమాచారం. తాజాగా అధికారులతో చేసిన రివ్యూ వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. లైవ్లో చూద్దాం.
Last Updated : Feb 28, 2024, 6:52 PM IST