టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేలా నూతన విధానం: మంత్రి సవిత - Minister Savitha Review on Textile
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 7:41 PM IST
Minister Savita Review on Textile Department with Officials: రాష్ట్రంలో త్వరలో టెక్స్‌టైల్ అపారెల్ గార్మెంట్స్ పాలసీని అమల్లోకి తీసుకువస్తామని చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించేలా నూతన విధానం ఉంటుందని ఆమె వెల్లడించారు. సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. టెక్స్‌టైల్ పాలసీలో భాగంగా నూతన పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 టెక్స్‌టైల్, అపారెల్ పార్కులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని ఈ ఆపారెల్ పార్కుల్ని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 146 మెగా టెక్స్‌టైల్ పరిశ్రమలు, 18,500 యూనిట్లు పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆగ్రో టెక్స్‌టైల్, జియో టెక్స్‌టైల్, మొబైల్ టెక్స్‌టైల్ యూనిట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ రంగాల్లోని పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ ఉంటుందని మంత్రి సవిత తెలిపారు.