జౌళి పరిశ్రమ సమస్యలను గుర్తించాం- త్వరలో ప్రోత్సాహకాలు: మంత్రి సవిత - Minister Savita
🎬 Watch Now: Feature Video
Minister Savita Meeting with Textile Industry Representatives : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న జౌళి పరిశ్రమ ప్రోత్సాహాకాల చెల్లింపు విషయాన్ని పరిశీలిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. సచివాలయంలో జౌళి పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. జౌళి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
పత్తి స్పిన్నింగ్, వస్త్రాలుగా రూపొందించే దశ వరకు ఉన్న సమస్యలను గుర్తించినట్లు మంత్రి సవిత చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేర చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను(Ease of Doing Business) మరింత మెరుగు పర్చే అంశంపై సీఎం ఎంతో నిబద్ధతతో ఉన్నారని పేర్కొన్నారు. జౌళి పరిశ్రమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పత్తి ఉత్పత్తి, నాణ్యత, కాలుష్య సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ మంత్రి, జిన్నింగ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.