కొత్త వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది సమస్య- త్వరలోనే అనుమతులన్నీ సాధిస్తాం : సత్యకుమార్ - Satya Kumar On Medical Colleges - SATYA KUMAR ON MEDICAL COLLEGES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 3:48 PM IST
Minister Satya Kumar On Medical Colleges in AP : నూతన మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్ ఈ ఏడాది అనుమతి ఇవ్వటం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాంకేతికత అందిపుచ్చుకుని సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని మంత్రి కోరారు.
BJP Membership Program in Guntur : అనంతరం మీడియాతో మాట్లాడిన సత్య కుమార్ కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది సమస్య ఎక్కువ ఉందని తెలిపారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. విద్యార్థులు ఉండేందుకు హాస్టల్ నిర్మించలేదని తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అడ్మిషన్స్ వచ్చేలా చేస్తామని ఆయన అన్నారు.