వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది: మంత్రి సత్యకుమార్ - SATYA KUMAR FIRE ON YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 3:26 PM IST
Minister Satya Kumar Fires on YSRCP : పట్టణ, గ్రామాల్లో పరిసరాలు బాగుంటే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కానీ గత ప్రభుత్వం పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణ, గ్రామల స్వచ్ఛతకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంతకు ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆర్డీఓ కార్యాలయంలో 5 స్వచ్ఛభారత్ ట్రాక్టర్లను ప్రారంభించారు. స్వచ్ఛభారత్‌లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా దీనిని ప్రధాని చేపట్టారని చెప్పారు. స్వచ్ఛభారత్ నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.