విజయవాడలో ఔట్ సోర్సింగ్ కోచ్‌ల ఆందోళన - జీతాలు చెల్లింపునకు మంత్రి అంగీకారం - Minister Respond to Coaches Concern
🎬 Watch Now: Feature Video
Minister Ramprasad Respond to Concern of Outsourcing Coaches: పెండింగ్ వేతనాలు చెల్లించాలని విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట ఔట్ సోర్సింగ్ కోచ్‌ల ఆందోళనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. తక్షణమే దస్త్రం పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వట్లేదని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ కోచ్‌లు నిరసన తెలిపారు.
జీతాలు లేక కుటుంబ పోషణ కూడా భారమైందని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమను ఔట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి శాప్ పరిధిలో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న శిక్షకులు అందరూ వచ్చి శాప్ అధికారులను కలిశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి వెంటనే కోచ్‌లకు జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంతో కోచ్‌లు ఆందోళన విరమించారు.