రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Minister Ramprasad reddy - MINISTER RAMPRASAD REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 1:27 PM IST
Minister Ramprasad Reddy Visits Rayachoti : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పట్టణంలో పర్యటించిన మంత్రి స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, రహదారులు తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. సత్వరమే మురుగునీటి కాలువ మరమ్మతులు చేయాలని పురపాలక అధికారులను ఆదేశించారు.
వర్షాలు వచ్చినప్పుడు పట్టణంలో పలు చోట్ల మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి సమస్యాత్మకంగా మారుతుందని, వాటిని గుర్తించి నీరు నిల్వ కాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పలువురు పేదలు ఆయనను కలిసి ఇల్లు మంజూరు చేయాలని, పెన్షన్ ఇవ్వాలని వినతి పత్రాలు అందజేశారు. రాయచోటిలో మురుగునీటిని శుద్ధ పరిచి నదులు చెరువులకు పంపే ఏర్పాటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు త్వరలోనే శంఖుస్థాపన చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.