సిటీస్ ఛాలెంజ్ పేరిట రాజధానిలో అభివృద్ధి పనులు - అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష - Narayan Review on Capital Works - NARAYAN REVIEW ON CAPITAL WORKS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 9:01 PM IST
Minister Narayana Reviews Works Progress in Capital with Officials : సిటీస్ ఛాలెంజ్ పేరిట రాజధానిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ (Municipal Administration Minister Ponguru Narayana) స్పష్టం చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (National Institute of Urban Affairs) ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పనులు జరుగున్నాయని ఆయన వెల్లడించారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24 గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టామని నారాయణ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లో భాగంగా 14 ప్రభుత్వ పాఠశాలలు, 17 అధునాతన అంగన్వాడీ సెంటర్లు, 16 ఈ - హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు నిర్మాణం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. వీటితో పాటు అత్యాధునిక పర్యావరణ అనుకూల శ్మశానవాటిక నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్‌లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోపు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.