గుంటూరు మున్సిపాలిటీలో సమస్యలపై మంత్రి నారాయణ చర్చ- కమిషనర్​కు ఆదేశాలు - Minister Narayana Review Officials - MINISTER NARAYANA REVIEW OFFICIALS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 12:12 PM IST

Minister Narayana Review with Guntur Municipal Officials : గుంటూరు నగరంలో ఉన్న ఆర్ అండ్ బీ రోడ్ల గుంతలను కార్పొరేషన్ తరపున మరమ్మతులు చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. నగరపాలక సంస్థ అధికారులతో ఆయన విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ (Guntur East MLA Naseer Ahmed), మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

కల్వర్టుల కింద పూడిక తీత అంశాలపైనా చర్చ : గుంటూరు నగరంలో పారిశుధ్యం, శివారు ప్రాంతాల్లో తాగు నీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై చర్చించారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి సూచించారు. డ్రెయిన్లు మరమ్మతులు, కల్వర్టుల కింద పూడిక తీత అంశాలపైనా చర్చించారు. గుంటూరు తూర్పు నియోజక వర్గంలో చెత్తను మాన్యువల్​గానూ, పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆటోల ద్వారా సేకరించాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.