నవీ ముంబైలో మంత్రి నారాయణ పర్యటన- అభివృద్ధి ప్రాజెక్టులపై పరిశీలన - Minister Narayana Navi Mumbai Tour - MINISTER NARAYANA NAVI MUMBAI TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 7:10 PM IST
Minister Narayana Navi Mumbai Tour: పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం నవీ ముంబైలో పర్యటించింది. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు సూర్యసాయి ప్రవీణ్‌చంద్, నవీన్‌తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న సిడ్కో హౌసింగ్ స్కీమ్స్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రణాళికలను మంత్రి బృందానికి సిడ్కో అధికారులు వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా నవీ ముంబై రోడ్ నెట్‌వర్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులు అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం మంత్రి కసరత్తు చేస్తున్నారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో ఇప్పటికే ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో అంగన్వాడీ, ఈ-హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, శ్మశానాలు ఇలా 48 రకాల పనుల్ని ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేసి సీఎం చంద్రబాబుతో ప్రారంభం చేయిస్తామని ఆయన ఇటీవలే వెల్లడించారు.