'ఆస్పత్రులకు రూ.16వందల కోట్ల బకాయిలు- ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిన జగన్' - Minister Nara Lokesh Fire on Jagan - MINISTER NARA LOKESH FIRE ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 4:41 PM IST
Minister Nara Lokesh Fire on Jagan: వైఎస్సార్సీపీ హయాంలో జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు వైద్యం అందించిన ఆస్పత్రులకు రూ.16 వందల కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు. బకాయిల వ్యవహారం బయటపెట్టి సాక్షి పత్రిక.. జగన్ పరువు తీసిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో ఇంటిపోరు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే తెలుస్తోందన్నారు.
"ఇంటి పోరు ఇంతింత కాదయా! ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చింది, ఆస్పత్రులకు రూ.1600 కోట్లు బకాయిలు పెట్టింది జగన్. బకాయిల వ్యవహారాన్ని బయటపెట్టి జగన్ పరువు తీసింది సాక్షి. ఇంతకీ ప్యాలెస్లో ఏం జరుగుతోంది?" - మంత్రి నారా లోకేశ్ ట్వీట్
Minister Parthasarathy About Aarogyasri Scheme: మరోవైపు ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు ప్రచారం తగదని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతోనే నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపేశాయని గుర్తుచేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్మోహన్ రెడ్డిది అని మండిపడ్డారు.