LIVE : ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar Visit in Eluru
🎬 Watch Now: Feature Video
Nadendla Eluru Tour Live : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను నాణ్యంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 251 స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నాణ్యత కల్గిన వస్తువులనే ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసిన 19 సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ.2,763 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వం 39,550 కోట్ల రూపాయల అప్పులు చేసిందని అన్నారు. అయితే రుణాలు తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బకాయిలు మాత్రం చెల్లించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.2,000ల కోట్ల బకాయిలు చెల్లించింద మంత్రి నాదెండ్ల వెల్లడించారు. తాజాగా నాదెండ్ల మనోహర్ ఏలూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Last Updated : Aug 12, 2024, 12:30 PM IST