ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కొనసాగుతోంది: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - MINISTER MANDIPALLI ON FREE BUS - MINISTER MANDIPALLI ON FREE BUS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 4:20 PM IST
|Updated : Aug 6, 2024, 4:28 PM IST
MINISTER MANDIPALLI ON FREE BUS SCHEME: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై పూర్తిస్థాయిలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని సమీక్షించి అతి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొన్న మంత్రి, మొక్కులు చెల్లించారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రుల భద్రత విషయంలో చేసిన తప్పులను తాము చేయమని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నారా చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్ధించానన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని, ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని అన్నారు.